కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలలో ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధకై తీర్మానం చేయాలి.కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలలో ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధకై తీర్మానం చేయాలి.

ఎస్సీ వర్గీకరణకు జరగబోవు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా తల్లాడ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అండ్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరహాదీక్ష శిబిరమును ఎమ్మార్పీఎస్ అండ్ ఎంఎస్పి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పగిడికత్తుల ఈదయ్య మాదిగ ప్రారంభం చేసి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేసినారు,అట్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ కు పార్లమెంటు ద్వారా చట్టబద్ధ కల్పించుట కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రము నుండి అఖిలపక్షమును ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసినారు, బిజెపి పార్టీలోని సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు ఎస్సీ వర్గీకరణ పై ఎమ్మార్పీఎస్ నిర్వహించిన సభలు సమావేశాలకు వచ్చి మద్దతు ప్రకటించినారు కానీ పూర్తి మెజార్టీ బిజెపి కి వున్నప్పటికీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పాస్ చేయకుండా నాన్చుడు ద్వారానితో వివరిస్తుందని తెలిపినారు ఇప్పటికైనా బిజెపి 18 నుంచి 22 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లుకు చట్ట బద్ధత కల్పించాలని కోరినారు లేనియెడల బిజెపి అంతమే మాదిగల పంతముగా పనిచేస్తామని తెలిపినారు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ కావాలని బయట మాట్లాడుతున్నవే తప్ప చట్టసభలలో తమ వానిని వినిపించకుండా మాదిగ మాదిగ ఉపలాల ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపినారు రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఇప్పటికైనా మార్చుకుని వర్గీకరణ పై చట్టసభల్లో తమవాదన వినిపించాలని కోరుతున్నాం లేనియెడల రానున్న ఎన్నికలలో రాజకీయ పార్టీల యొక్క పతనమే మాదిగల పంతముగా పనిచేస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కోట బలరాం మాదిగ(ఎమ్మార్పీఎస్ . ఎమ్మార్పీఎస్. మండల నాయకులు అదంకి వెంకటేశ్వర్లు. మేడి,వెంకయ్య,మేడి,కృష్ణయ్య,మేడి,సత్యం,మేడి,చిన్న కృష్ణయ్య, గొడ్ల,వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News