
360 వీఆర్ఏలను వారి విద్య అర్హతను బట్టి పోస్టుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 360 మంది వీఆర్ఏలను వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల లోని ప్రభుత్వ స్కేల్ పోస్టులలో నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
బుధవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 360 వీఆర్ఏలను వివిధ శాఖలలో ఖాళీలలో భర్తీ కొరకు కేటాయింపు పై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తంగా 61 సంవత్సరంల లోపు వారు 394 మంది ఉన్నారని వారి 360 మందిని మహబూబాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగిందని మిగతా 34 మందిలో 32 మందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరో ఇద్దరినీ హనుమకొండ జిల్లాకు కేటాయించినట్లు వివరించారు.
జిల్లా కేటాయించిన 360 మందిని వివిధ శాఖలకు కేటాయించినందున ఉద్యోగులందరూ తమ విధుల్లో చేరెందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో స్థానిక తొర్రూరు రహదారిలో ఉన్న బాలాజీ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై కేటాయించిన శాఖలలో చేరెందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
జిల్లా అధికారులందరూ కేటాయించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని శాఖలకు కేటాయించిన సిబ్బందిని వీధుల్లో చేర్చుకుంటున్నట్లుగా ప్రొసీడింగులను సిద్ధం చేసుకొని విధుల్లోకి చేరినట్లు నివేదిక అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో అదరపు కలెక్టర్ డేవిడ్ జెడ్పి సీఈవో రమాదేవి డిఆర్డిఓ సన్యాసయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.