
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్/స్టేట్ బ్యూరో మొహమ్మద్ సలీం
జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామంలో 241వ ఓటు కేంద్రము అధ్యక్షుడు ఈ.అశోక్ నేతృత్వంలో గ్రామానికి చలో కార్యక్రమం నిర్వహించబడింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్ కుమార్ హాజరై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి గ్రామంలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.ఈ సందర్భంగా గ్రామ సమస్యలపై చర్చించడంతో పాటు, బూత్ సమావేశం నిర్వహించారు.గ్రామంలోని పెద్దలను కలసి సన్మానించారు.పల్లె దవాఖానలో సమస్యలు తెలుసుకొని,ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు.రేషన్ దుకాణాన్ని పరిశీలించి ప్రతి లబ్ధిదారుడికి రశీదు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈ.రాకేష్,సి.హెచ్.భాస్కర్,ఈ.ప్రశాంత్,ఈ.వెంకటేష్,బి.మనోజ్,కె.అశోక్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.