
ఈ69న్యూస్ ధర్మసాగర్/స్టీఫెన్ ప్రణయ్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కమిటీ సభ్యులు వక్కల సుమన్, రాజరపు ప్రదీప్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “భారతదేశం అగ్రగణ్య మేధావుల్లో అంబేద్కర్ ఒకరు.ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర అమోఘం.సమానత్వం,గౌరవం అందరికీ కల్పించాలని పరితపించిన మహోన్నతుడైన అంబేద్కర్,అణగారిన వర్గాల సంక్షేమానికి నిరంతరంగా పోరాడారు” అని తెలిపారు.సామాజిక దురాచారాలపై గళమెత్తిన ఉద్యమకారుడిగా,మహిళలు,కార్మికుల హక్కుల సాధనలో అంబేద్కర్ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.ఆయన ఆశయాలు,ఆదర్శాలు నేటికీ సమకాలీనంగా కొనసాగుతుండటం గొప్ప విషయం అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రాజశేఖర్,ఉపాధ్యక్షులు గూడూరు ప్రణయ్,ప్రధాన కార్యదర్శి రాజారపు ప్రశాంత్,వక్కల రజినీకాంత్, మేకల శ్రీకాంత్,చల్లూరి ప్రశాంత్,వక్కల అక్షిత్, వక్కల భరత్, వక్కల రంజిత్, వక్కల దినేష్, వక్కల వెంకటేష్, వక్కల రాజు తదితరులు పాల్గొన్నారు.