ఈ 69 న్యూస్ ధర్మసాగర్ రిపోర్టర్ స్టీఫెన్ ప్రణయ్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ముప్పారం గ్రామపంచాయతీ వేదికగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎస్సీ కాలనీలో జరిగిన సభలో ముంజ వెంకటరాజం గౌడ్ మాట్లాడుతూ – అంబేద్కర్ లాంటి మహానేతలు భవిష్యత్తులో పుట్టరని, ఆయన 32 డిగ్రీలు సంపాదించి భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత భారతరత్నగా నిలిచిందని అన్నారు.అంబేద్కర్ ఆశయాలపైనే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, 1990లో ఆయనతో పాటు నెల్సన్ మండేలకు భారతరత్న బిరుదు కేటాయించారని గుర్తు చేశారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.