క్రిస్మస్ సందర్భంగా 50 కేజీల బియ్యం విరాళం
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం,కరుణాపురం గ్రామంలోని కరుణాలయంలో క్రిస్మస్ పవిత్ర పండుగను పురస్కరించుకొని రిపోర్టర్ అనిల్ రాజ్ సేవా కార్యక్రమం నిర్వహించారు.తన తాత-నానమ్మలు కీ.శే.గొల్లపల్లి రాజయ్య,వెంకటమ్మల జ్ఞాపకార్థంగా కరుణాలయంలోని అనాథ పిల్లలకు 50 కేజీల బియ్యాన్ని విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమానికి కరుణాపురం గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా-ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై,అనిల్ రాజ్ సేవాభావాన్ని అభినందించారు.ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నారాయణ (రాజయ్య పెద్ద కుమారుడు),ఎం.డి.శంషుద్దీన్ (ఎంఎస్పీ మండల అధ్యక్షుడు),చిట్యాల రమేష్ (రిపోర్టర్),కందుకూరి అజయ్ చందర్ (లెక్చరర్),కందుకూరి ప్రభాకర్ (ఎంఆర్పీఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు),ఎం.డి.నసీరోద్దీన్,ఫాస్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.క్రిస్మస్ పండుగ సందేశమైన ప్రేమ,సేవ,దాన గుణాలను ఆచరణలో చూపిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు హర్షాతిరేకాలతో స్వాగతించారు