చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
కొత్తగూడ మండలంలోని సాధిరెడ్డిపల్లి–ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్టపై గురువారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, జంగవాణిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన సనప జంపయ్య (తండ్రి: సారయ్య) ఈ ట్రాక్టర్ను నడిపిన వ్యక్తిగా గుర్తించారు.చెరువు కట్టపై ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని స్థానికులు హెచ్చరించినప్పటికీ, డ్రైవర్ వాటిని పట్టించుకోకుండా రాత్రి సుమారు 10 గంటల సమయంలో వాహనంతో వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువు కట్టపై బోల్తా పడినట్లు సమాచారం.ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అలాగే డ్రైవర్ సురక్షితంగానే ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉండగా, స్థానికులు చెరువు కట్టపై జరుగుతున్న పనుల దృష్ట్యా రాత్రి వేళ వాహనాల రాకపోకలపై నియంత్రణ అవసరమని కోరుతున్నారు