కాంగ్రెస్తోనే వచ్చే రోజుల్లో అభివృద్ధి సాధ్యం.
– బీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు వృథా చేసుకోకండి.
– ఏడేళ్లలో మునిసిపాలిటీ అస్తవ్యస్తం
– తండాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నించండి..
- ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్
- గడచిన ఏడేళ్లలో మరిపెడ మునిసిపాలిటీ అస్తవ్యస్తంగా మారిందని, కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీకి నిధులు మంజూరైనా గత పాలకులు ఏ ఒక్క పని చేయలేదని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఆక్షేపించారు. సోమవారం మరిపెడ మునిసిపాలిటీలోని లోక్య తండాలో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు, మాజీ వార్డు మెంబర్ బోడ వీరన్న, బోడ శ్రీను, బోడ శ్రీనివాస్, బోడ తులస్యలతో పాటుగా 200మంది బోడ సుజాత రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలకు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు పట్టణానికి చేసిందేమి లేదని, అందుకే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. తండాకు చెందిన కీలక నేతలకు సైతం సముచిత గౌరవం లభించకే నేడు కాంగ్రెస్ గూటికి చేరన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా విజ్ఞతతో ఆలోచించి నిర్ణయంతీసుకోవాలని, ఎన్నికల్లో పాల్గొని డబ్బులు వృథా చేసుకోకూడదని హితవు పలికారు. తండాల్లో అంతా ఒకే కుటుంబం అనుకుని ఏకగ్రీవాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నేత నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మాజీ సర్పంచులు పానుగోతు రాంలాల్, లక్ష్మిపతి, నాయకులు గంధసిరి అంబరీష, కాలం రవీందర్ రెడ్డి, కొంపెళ్లి సురేందర్ రెడ్డి, అబ్బాయిపాలెం సర్పంచ్ బోడ సోమ్లా, ఉపసర్పంచ్ షరీష్ తదితరులు పాల్గొన్నారు.