ఇంటింటి ప్రచారంలో రెడ్యా నాయక్
డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో ప్రముఖ వ్యక్తులను, వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్న డోర్నకల్ మాజీ శాసనసభ్యులు రెడ్యా నాయక్,మహబూబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఏనుగుల రాకేష్ రెడ్డి,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మరిపెడ పట్టణంలో మీ అనుభవం మీ ఆలోచన విధానాలు మున్సిపాలిటీ ప్రజలకు ఎంతో అవసరమని మున్సిపాలిటీలోని సీనియర్ నాయకులని ప్రముఖ వ్యాపారస్తులని,మాజీ సర్పంచులని వివిధ సంఘాల నాయకులని కలిసి మున్సిపాలిటీలోని నిలబడిన అభ్యర్థులకు మీ సహాయ సహకారాలు కావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తున్నారని మీరంతా మా పాత మిత్రులైన అని తెలిపారు ఈసారి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను అన్నారు,వారి వెంట మరిపెడ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఉప్పుల నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ రాంపెల్లి అబ్బయ్య గౌడ్,మల్లు ఉపేందర్ రెడ్డి, మార్కెండ్య, రమేష్,వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.