జాగృతి అభ్యర్థికి మద్దతుగా భారీగా చేరికలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ నుంచి తెలంగాణ జాగృతి – ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పరి సంగీతకు మద్దతుగా 50 మంది కార్యకర్తలు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నగరంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, నగర పాలక సంస్థకు వచ్చిన నిధులను దారి మళ్లించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ అంశంపై ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడడం లేదని ప్రశ్నించారు.ప్రశ్నించే గొంతుకగా కవితక్క నాయకత్వంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా, కరీంనగర్ అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి మరియు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు.కరీంనగర్ ప్రజలు సింహం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కవితక్క నాయకత్వంలో జాగృతి ద్వారా కరీంనగర్ అభివృద్ధికి అడుగులు వేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు చంటి శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివారణి, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.జాగృతిలో చేరిన వారిలో లంక భవాని, లంక మనోజ్, ఉప్పరి మనీత్, ఎస్.కే. బషీరా, రామగిరి అనవ్వ, అస్తపురం అంజలి, తాళ్ల హారిక, బుర్ర రాజు, గసికంటి సాయి వంశి, బొడ్డు పెళ్లి సాయి, కుమ్మరి సాయి కృష్ణ, పండురాల రాజు, మైసాని యశ్వంత్, కుక్క రవి, బత్తుల వివేక్, మంథని ప్రసాద్, ఎండీ షరీఫ్, కౌరు కోటి తదితరులు ఉన్నారు.