ఆటో, మోటార్ రంగాల జేఏసీ సమ్మె నోటీసు
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
కార్మికులకు అనువైన చోట అడ్డా లు ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రవాణా చట్టం రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జీవనభృతి 12000 చెల్లించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,* రవాణా రంగంలో ఆటో కార్మికులు ఎంతో కీలకపాత్ర వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు కిస్తీలు కట్టలేక ఫైనాన్స్ కట్టలేక ఆటోలను అమ్ముకొని రోడ్డున పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రంస్పందించకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రతి ఆటో కార్మికునికి సంవత్సరానికి 12,000 జీవన భృతి వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆటో కార్మికులు కిరాయిలు లేక అడ్డాల మీద కూర్చుని ఏ కిరాయి దొరుకుతుందా ఎవరు వస్తార అని ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా రాపిడో లాంటి ప్రైవేట్ సంస్థలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని ఆయన అన్నారు.. ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు రాపిడో లాంటి సంస్థలు గుది బండగ మారాయని ఆయన అన్నారు.. రవాణా కార్మికులకు ఓలా ఉబర్ లాంటి ప్రైవేట్ యాప్ రద్దుచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి యు యాప్ ప్రవేశపెడతానని కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పిస్తానని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు రవాణా రంగ కార్మికుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగాని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో కార్మికులకు జీవన భృతి చెల్లించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో జీవన భృతి ఎందుకు చెల్లించరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ఆటో కార్మికుల ప్రయాణం మొత్తం రోడ్డుమీదనే ఉండటంవల్ల వారి యొక్క జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వారి సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక సమగ్ర చట్టం చేయాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు.రవాణా రంగ కార్మికులకు గుది బండగ మారిన 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ జీవన భృతి 12000 వెంటనే చెల్లించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులకు అనువైన చోట అడ్డా లు ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో: ఐ ఎన్టియూసి పాల్వంచ కృష్ణ, సీఐటీయూ జిల్లా ఉపేందర్, ఏఐటియూసి పేరబోయిన మోహన్రావు,బిఆర్టియూ షేక్ సత్తార్ ,టి యూ సి ఐ శ్రీను, నాయకులు ఆజాద్ , నాగరాజు, దేవ,
రెడ్డి తదితరులు పాల్గొన్నారు.