మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గులాబీ జోష్
వాడవాడల జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్. మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఏనుగుల రాకేష్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు కి అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్బంగా 7 వార్డు లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శోభారాణి,వార్డు ఇన్చార్జి మాజీ జెడ్పిటిసి గుగులోత్ శారద రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో 8 వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శిరీష నరేష్, వార్డు ఇంచార్జి కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్, అజ్మీరా నారాయణ ఆధ్వర్యంలో చేసిన సమావేశంలో ఇంచార్జి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..మనం వేసే ఓటు అభివృద్ధిలో మార్పు తేవాలి అన్నారు,కారు గుర్తుకు ఓటేస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో చూసిండ్రు,
కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంత ఆగమైనమో ఈ రెందేళ్ళలో తెలిసింది,2014 కు ముందున్న రోజులే మళ్లీ వస్తున్నయ్,కెసిఆర్ కు మించి ఏదో ఇస్తామంటే కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిండ్రు,కెసిఆర్ కు ఓటేస్తే 24 గంటల కరెంట్, రైతుబందు, రైతుభీమా, తాగు, సాగు నీళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,ఆసరా పెన్షన్లు ఇలా అనేక సంక్షేమ ఫలాలు అందినయ్ అన్నారు,ఇచ్చిన హామీలే కాదు ప్రజలకు అవసరమైనా అనేక పథకాలు పెట్టిన ఘనత కెసిఆర్ ది,కానీ కాంగ్రెస్ కు ఓటేస్తే అరాచకం, నిర్లక్యం, కొట్లాటలు, గొడవలు, కేసులే అన్నారు,
అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పరు,కానీ ఎన్నికలోస్తే మాత్రం డైవర్సన్ పాలిటిక్స్ మొదలు పెడతరు.రేవంత్ ఓటమి భయంతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండు..అడ్డగోలు మాటలు, బూతు పురాణాలు తప్ప.. ఆయన బాష తీరు మారదు..ప్రశ్నిస్తే అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు..మీలాగా చిల్లర రాజకీయాలు చేయం.. బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటిస్తున్నారు అన్నారు,కెసిఆర్ నేర్పింది అభివృద్దే.. అరాచకాలు కాదు..గతంలో కాంగ్రెస్ అరాచక పాలన తెలిసికూడా మరోసారి అవకాశం ఇచ్చిండ్రు..రెండేళ్లుగా మళ్లీ వాళ్ల పాత పద్ధతులే.. అరాచక నిర్లక్ష్య పాలనే..అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ కి బుద్దిచెప్పాలి అన్నారు,
అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తుంది..ప్రజలంతా గులాబీ దండుకు బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతున్నరు,ఇదే ఉత్సాహంతో అన్ని మున్సిపల్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలి అని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు రాంపెల్లి అబ్బయ్య గౌడ్,బాలాజీ,జి ఎన్ రెడ్డి, ఊరుకొండ శ్రీనివాస్, పేపర్ శ్రీనివాస్,గోల్కొండ వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు