
సత్తుపల్లి, మార్చి 15 (ఈ69న్యూస్): ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దయ, సహనం, సేవాభావం, స్వీయ నియంత్రణ వంటి మంచి గుణాలను పెంపొందిస్తుందని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు.విశ్వశాంతి విద్యాలయంలో శనివారం రంజాన్ ప్రాముఖ్యతను తెలియజేసేలా ముందస్తు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేదవారికి సహాయం చేసే ఉద్దేశంతో “జకాత్” కార్యక్రమం నిర్వహించారు. ఐక్యతను పెంపొందించేలా “ఇఫ్తార్ విందు” ఏర్పాటు చేశారు. సర్వమత శ్రేయస్సు కోసం నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు. ఆనందాన్ని పంచుకునే భాగంగా మెహంది కార్యక్రమం కూడా నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవిస్తూ మతసామరస్యం పాటించాలని సూచించారు. రంజాన్ మాసం సోదరభావం, సమానత్వం, ప్రేమ, దయ, శాంతి వంటి విలువలను పెంపొందిస్తుందని చెప్పారు. ఉపవాసం ద్వారా స్వీయ నియంత్రణ, సహనం అలవడుతాయని తెలిపారు. దేవునికి దగ్గర కావడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రార్థనలు దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.