
ఈ69 న్యూస్, హైదరాబాద్, మార్చి 15హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య హాజరై స్వర్ణకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాలు, సామాజిక రంగాల్లో మహిళలు మరింత చురుకుగా పాల్గొనేలా మహిళా కాంగ్రెస్ కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతూ మహిళల సమస్యల పరిష్కారానికి బలమైన స్వరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలను సంఘటితం చేసి పార్టీని మరింత బలపర్చడంలో మహిళా కాంగ్రెస్ ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతా రావ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ తదితరులు పాల్గొన్నారు.