కార్మికుల సంక్షేమమే ఐఎన్టీయూసీ ధ్యేయం
సత్తుపల్లి పట్టణం సింగరేణి లో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు అధ్యక్షతన ఐఎన్టీయూసీ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాయింట్ జనరల్ సెక్రెటరీ తీగల క్రాంతికుమార్ పాల్గొన్నారు.తీగల క్రాంతి కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి లో జరిగిన సమావేశంలో స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల సమస్యలపై మెడికల్ బోర్డు నిలిపివేత అంశంపై స్పందించి బోర్డు నిలిపి వేయలేదని చెప్పినప్పటికీ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పునరుద్ధరణ చేయించలేని స్థితిలో ఉన్న గుర్తింపు సంఘం ఏ.ఐ.టి.యు.సి యూనియన్ పూర్తిగా వైఫల్యం చెందిందని , ఎన్నికల్లో ఏ.ఐ.టి.యు.సి కార్మికులకు అనేక హామీలు సాధిస్తామని మభ్యపెట్టి గుర్తింపు సంఘంగా గెలిచారని విమర్శించారు. గుర్తింపు సంఘంగా గెలిచిన నాటినుండి ఏ.ఐ.టి.యు.సి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కార్మికులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఐఎన్టీయూసీ సిద్ధంగా ఉందని తెలియజేశారు.సింగరేణి కార్మికుల హక్కులు సంక్షేమానికి సమర్థంగా కాపాడగల సామర్థం కేవలం ఐఎన్టీయూసీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఆదాయ పన్ను మాఫీ , కార్మికులకు సంత ఇంటి పథకం , మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి కీలక అంశాలను నిరంతరం మా నాయకుడు ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలియజేశారు. ఐఎన్టియుసి అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి , సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి సంస్థ పరిరక్షణ , కార్మికుల సంక్షేమం , నూతన హక్కుల సాధన విషయంలో ఐఎన్టీయూసీ యూనియన్ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో: బ్రాంచ్ నాయకులు నాగ ప్రకాష్ , జే.వి.ఆర్ ఓసి ఫిట్ సెక్రటరీ సీతారామరాజు , కిష్టారం ఓసి ఫిట్ సెక్రటరీ బాలాజీ , నాయకులు సురేష్ , శ్రీధర్ , పొట్టి కిరణ్ , ఐ.వి.రెడ్డి , మురళీకృష్ణ , శ్రీనివాస్ రాము , తిరుమలరావు , రామచందర్ , రమేష్ , ఇక్బాల్ , సుదర్శన్ , రామారావు ,శ్రీనివాస చారి , శ్రీనివాసరావు , అశోక్ , సదానందం , సుదర్శన్ , గణేష్ , వెంకటేశ్వర్లు , షాట్రాక్ బాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.