ఉల్లాస్ అమ్మకు అక్షరమాల కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ - బిల్లా యాదగిరి
వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని వేలేరు మండల మహిళా సమాఖ్య ఏపిఎం అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి,మండల విద్యాశాఖ అధికారి చంద్రమౌగిళి హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ,ఈ కేంద్రంలో సుమారు 650 మంది వయోజనులకు ఉల్లాస్ అక్షరాస్యత పరీక్ష నిర్వహించబడుతోందని తెలిపారు. ప్రతి ఇంటిలో చదువుకున్న మహిళ ఉంటేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, మహిళల విద్య సమాజ పురోగతికి కీలకమని అన్నారు.మహిళా సంఘాల ద్వారా విద్యను అభ్యసించిన వారికి పరీక్షలు రాయడానికి వీలుగా ప్రత్యేకంగా ఈ వయోజన అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో వీవోస్ అధ్యక్షులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ అకౌంటెంట్లు తదితరులు పాల్గొన్నారు.