నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్
పర్వతగిరి మండలం శ్రీనగర్, కొంకపాకలోని ఎమ్.ఎస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, జర్నలిస్టు నాంపల్లి మల్లేశం హాజరయ్యారు.కట్ర్యాల గ్రామానికి చెందిన చి.ల.సౌ.రాసూరి కళావతి-రాజ్ కుమార్ల కుమార్తె చి.ల.సౌ.మానస,చి.శ్రావణ్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.