దుబ్బ శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ మంత్రి
వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు,ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ ని మాజీ మంత్రి వర్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు శ్రీనివాస్ తల్లి దుబ్బ వీరలక్ష్మి ఇటీవల మృతి చెందగా శనివారం ఎర్రబెల్లి దయాకర్ రావు కాశిబుగ్గ వివేకానంద కాలనీలోని శ్రీనివాస్ నివాసానికి చేరుకొని వీరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం శ్రీనివాస్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పర్వతగిరి సొసైటీ చైర్మన్ మనోజ్ గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల యాదగిరి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరి రాజశేఖర్ పర్వతగిరి మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర రావు 14 డివిజన్ నాయకులు పత్రి సుభాష్, పత్రి రాజా పోషాలు, పొడిశెట్టి అశోక చారి, పేకటనోజు వీరాచారి, పొన్నం ప్రభాకర్, మండల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.