తక్షణమే విద్యుత్ ఏ.ఈ ని నియమించాలి
పర్వతగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల శంకర్ మాట్లాడుతూ
ఉదయం 6 గంటల నుండి ఏజీఎల్ పర్వతగిరి విద్యుత్తు సరఫరా లేనందున పలువురు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దున్నిన, దున్నుకోవలసిన నారు మళ్లకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో విద్యుత్ ఏ.ఈ లేనందున, అన్ని సమస్యలు ఏడీ తిరుపతి తో చెప్పుకోవాల్సి వస్తుంది. జిల్లా విద్యుత్ ఉన్నతాధికారులు మండల కేంద్రంలో తక్షణమే విద్యుత్ ఏ.ఈ ని నియమించాలని రైతులు కోరుతున్నారని పోకల శంకర్ అన్నారు . రైతులకు కొత్త లైన్లు వేసేవి అలాగే ఉండిపోయినవి, వర్షాకాలం మొదలు కావస్తుంది. సంబంధిత విద్యుత్ అధికారులు వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే అన్ని ఏర్పాట్లు చూడాలని కోరుతున్నారు. సింగిల్ ఫేజ్ లో ఉన్న మోటార్లకు తక్షణమే త్రీ ఫేజ్ సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.