30 న తహశీల్దార్ కార్యాలయాల ఎదుట బిల్డింగ్ వర్కర్స్ ధర్నాలు
సీఎస్సీ హెల్త్ టెస్టుల పేరుతో ఖజానా ఖాళీ చేస్తార?
ట్రైల్ బ్లేజర్ లీజు రద్దు చేయాలి: ముదాం శ్రీనివాసరావు(బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) జూన్ 30 న సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం ఆయన సత్తుపల్లి,వేంసూరు,పెనుబల్లి మండలాలలో పర్యటించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో ముదాం మాట్లాడుతూ సీఎస్సీ హెల్త్ టెస్టుల పేరుతో భవన నిర్మాణ కార్మికుల నుండి రక్త నమూనాలు సేకరించి ఎందుకు పనికిరాని తప్పుడు రిపోర్ట్ లు ఇస్తూ కార్మికులను భయాందోళనకు గురి చేస్తుందని బోర్డు నుండి ప్రతి కార్మికుని పేరుతో 3600 రూపాయల చొప్పున కోట్ల రూపాయల సొమ్మును వెల్ఫేర్ బోర్డు నుండి తీసుకుంటుందని పథకం ప్రకారం అధికారులు దోచి పెడుతున్నారని సీఎస్సీ టెస్ట్ ల పేరుతో ఖజానా ఖాళీ చేస్తారా ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు.గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.నేరుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి కార్మికులకు బోర్డు నుండి ఆర్థిక సహాయం చేసేలా ఆలోచన చేయాలని సీఎస్సీ లీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వెల్ఫేర్ బోర్డు నుండి మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయాలు ఇచ్చే బాధ్యత నుండి ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ను తొలగించి ట్రైల్ బ్లేజర్ అనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థకు అదనపు ప్రీమియం చెల్లించి కార్మికుల భద్రతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.గత ఏడాది లో అట్టి ఇన్సూరెన్స్ సంస్థకు బోర్డు నుండి 300 కోట్ల రూపాయలు చెల్లించింది.ట్రైల్ బ్లేజర్ మాత్రం మరణించిన కార్మికుల కుటుంబాలకు సగం మందికి కూడా పరిహారం చెల్లించలేదని ఇదేమిటంటే బోర్డు చైర్మన్ లెటర్ ఇవ్వాలంటూ పొంతన లేని సాకులు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు.మరలా వచ్చే నెలలో ఈ సంస్థ లీజు రెన్యువల్ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుని బోర్డు అడ్వైజర్ కమిటి ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమానికి పాటు పడాలని హితవు పలికారు.అట్టి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో: జిల్లా అధ్యక్షులు ధోనోజు లక్ష్మణాచారి,ఉపాధ్యక్షులు బోయినపల్లి వీరబాబు,మల్లూరు చంద్రశేఖర్,సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు,జిల్లా కమిటి సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు,ఓలేటి శ్రీహరి, నాగులమీరా,తిప్పిశెట్టి శివ,అబ్దుల్ రెహ్మాన్,గుడిమెట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
Good coverage medam garu namasthe.శుభోదయం.