స్వెరోస్ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ
స్వెరోస్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 34 మంది ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ విద్యార్థినులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ నాజియా సల్మా అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథులుగా పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ.బిక్షపతి, పర్వతగిరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కె.నవీన్ కుమార్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్వెరోస్ నెట్వర్క్ మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అభినందించారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఒడిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో బిఎస్ఎంఎస్ చదువుతున్న ధరావత్ సౌమ్య హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.పాఠశాల స్థాయి నుండే భవిష్యత్తులో చదివే కోర్సులపై అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా స్వెరోస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్,అధికార ప్రతినిధి గారె జయరాజ్ మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను పాఠశాల స్థాయి నుండే ఏర్పరచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వెరోస్ నాయకులు, పాఠశాల సిఆర్టిలు గూగులోత్ పద్మ, బత్తుల పద్మ,శోభారాణి,ఏ.రాణి, జి.సునీత,వై.వి.భారతి, దివ్య, కెజిబివి విద్యార్థినులు పాల్గొన్నారు.