రాహుల్ గాంధీ అరెస్ట్ ఆప్రజాస్వామ్యం-కాంగ్రెస్ ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ డిమాండ్
•బిజెపి అరాచకాలు హిట్లర్, స్టాలిన్ ను మించాయి-నరుకుడు వెంకటయ్య
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని అన్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని పోషమ్మైదనం సర్కిల్ లో మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు మన్నే బాబు రావు* మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడి దేశంలోని ప్రతి పౌరుడిపై జరిగినట్లే.న్యాయం కోసం లక్షలాది యువకులు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయలేరు.విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతుంది? పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి? విద్యా ఖర్చు ఎందుకు పెరుగుతుంది? వీటికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తపరచుకునే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలో ప్రధాన మంత్రి నివాసానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అడ్డుకోవడం,ఆయనపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడే అని అన్నారు.పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలు,పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు వంటి కీలక అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు సింగపురపు అరుణ, కాట్రియా ల టెంపుల్ చైర్మన్ శ్రీపాది సతీశ్,మాజీ కార్పొరేటర్ ఈ రాహుల్ గాంధీ అరెస్ట్ ఆప్రజాస్వామ్యం-కాంగ్రెస్ ఆందోళన
•కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ డిమాండ్
•బిజెపి అరాచకాలు హిట్లర్, స్టాలిన్ ను మించాయి-నరుకుడు వెంకటయ్య
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని అన్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని పోషమ్మైదనం సర్కిల్ లో మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు మన్నే బాబు రావు* మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడి దేశంలోని ప్రతి పౌరుడిపై జరిగినట్లే.న్యాయం కోసం లక్షలాది యువకులు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయలేరు.విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతుంది? పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి? విద్యా ఖర్చు ఎందుకు పెరుగుతుంది? వీటికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తపరచుకునే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలో ప్రధాన మంత్రి నివాసానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అడ్డుకోవడం,ఆయనపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడే అని అన్నారు.పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీలు,పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు వంటి కీలక అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు సింగపురపు అరుణ, కాట్రియా ల టెంపుల్ చైర్మన్ శ్రీపాది సతీశ్,మాజీ కార్పొరేటర్ ఈ దూల విక్టర్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కర్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకుడు కర్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.