పలువురు హర్షం"
సత్తుపల్లి/ వేంసూరు,జూలై 28 (తెలుగుగళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు లిఫ్ట్ చైర్మన్గా సయ్యద్ ఇబ్రహీం మంగళవారం నియమితులయ్యారు.
దీంతో వేంసూరు ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఆయన నాయకత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతమై రైతులకు మెరుగైన సేవలు అందుతాయనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన వేడుకలో వేంసూరు గ్రామ సర్పంచ్ ఎండి ఫకృద్దీన్, మన తెలంగాణ పత్రిక రిపోర్టర్ మహమ్మద్ బుర్హానుద్దిన్,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్,ఎర్రసానివారి బంజర లిఫ్ట్ చైర్మన్, సర్పంచ్ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి అక్బర్, ఉపసర్పంచ్ ఈడా కొండల్, కిన్నెర లాజర్, కిన్నెర వెంకటేశ్వరరావు, గౌసుద్దీన్, చెన్నారావు తదితరులు పాల్గొని సయ్యద్ ఇబ్రహీంకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.