జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌కు వినతి
ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు”
జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌కు వినతి”
సత్తుపల్లి,ఆర్ సి,జూలై30(తెలుగుగళం) న్యూస్ : సత్తుపల్లి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లకు ఇటీవల విడుదల చేసిన సర్కులర్ ప్రకారం వెంటనే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ ఐఎన్టీయూసీ సత్తుపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం, జేవీఆర్ ఓసీ పిట్ సెక్రటరీ సీతారామరాజు, కిష్టారం ఓసీ పిట్ సెక్రటరీ షణ్ముఖ చారి, జేవీఆర్ సీహెచ్‌పీ పిట్ సెక్రటరీ నగేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నేత కోటేశ్వరరావు మాట్లాడుతూ సత్తుపల్లి ఏరియాలో పనిచేస్తున్న అనేక మంది సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లు గత ఐదు నుంచి 13 సంవత్సరాలుగా కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి ప్రతిరోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ ప్రకారం సీనియారిటీ ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే పలువురు కార్మికులు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే అవకాశం లభించి ఎంతో ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. అందువల్ల వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే నిర్వహించాలని కోరారు.
వినతిపై స్పందించిన జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో: బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు నజీర్, హమీద్, యశ్వంత్ రెడ్డి, యాకుబ్, రమేష్, రాజామొగిలి, శీను, గోపి, రాములు, రవి, సురేష్, అప్పారావు, కుమార్, మంగ్య, సత్య, రాఫీ,రవిచంద్రతో పాటు ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.