మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
విచారణ కోరుతూ కలక్టర్ కు వినతి: మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య”
సత్తుపల్లి,ఆర్ సి,జూలై30(తెలుగుగళం) న్యూస్: ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.ను గురువారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధిత అభ్యర్థులతో కలిసి వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఈ నియామకాలలో అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. మొత్తం నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.
బాధిత అభ్యర్థులకు ధైర్యం చెప్తూ.. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే ఈ అక్రమాలపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని సండ్ర వెంకట వీరయ్య భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో: మాజీ మండల & నగర పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, నాయకులు బిచ్చాల తిరుమలరావు, బత్తుల మురళి, మరియు తదితర నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.