జేవీఆర్ సీహెచ్పీకి ప్రథమ స్థానం
సత్తుపల్లి,ఆర్ సి,జూలై 30 (తెలుగుగళం న్యూస్): గత సంవత్సరం నిర్వహించిన 56వ రక్షణ వార్షిక పక్షోత్సవాల సందర్భంగా కంపెనీ వ్యాప్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో సీహెచ్పీ విభాగంలో జేవీఆర్ సీహెచ్పీ ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గత సోమవారం రామగుండం–1 ఏరియాలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ట్రోఫీతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.
బహుమతులు అందుకున్న సందర్భంగా జేవీఆర్ సీహెచ్పీలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఏరియా ఇంజనీర్ కె. సోమశేఖరరావు, ఎస్సీ (ఈ&ఎం) పి. సాయినాథ్, డివిజనల్ ఎస్సీ (ఈ&ఎం) బి. రాంబాబు, సేఫ్టీ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) ఎ. ప్రదీప్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ డి. ప్రసాద్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ ఇ. నగేష్తో పాటు ఇతర అధికారులు, కార్మికులు పాల్గొని జేవీఆర్ సీహెచ్పీ బృందాన్ని అభినందించారు.