
పీడిత ప్రజల ఆశాజ్యోతి అంబేద్కర్
చిన్న గూడూరు స్థానిక మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, దాశరధి కళాబృందం ఆధ్వర్యంలో ముఖ్య అతిధుగా హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దేశ గాని కృష్ణ , ప్రజాకవి రచయిత దాశరధి కళాబృందం గౌరవ అధ్యక్షురాలు తొట్ల వెంకటలక్ష్మి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ . దేశంలో అందరూ సమానమేనని చాటుతూ పీడిత వర్గాల ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారన్నారు. అందరికి సమాన విద్య అందుతుందంటే అదీ అంబేడ్కర్ వలనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అంబేద్కర్ అందించిన హక్కులు, పౌర ధర్మాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పసనాది విజయ్, సుధాగాని సాయి కృష్ణ, అబ్బాస్, వీరన్న, దాశరధి కళాబృందం మండల అధ్యక్షురాలు తొట్ల ఉప్పలమ్మ, ప్రధాన కార్యదర్శి తినపల్లి
జయమ్మ, శ్రీరామ్ ఉప్పమ్మ, పులి మంజుల, ఉపేంద్ర, దోసపాటి మంగమ్మ ,పులి పద్మ, కొండపాక ఉపేంద్ర, మోరగుండ్ల ఉపేంద్ర, కంచనపల్లి గౌరమ్మ, బుల్లి కొండ కళమ్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.