
దేవరుప్పుల (పాలకుర్తి నియోజకవర్గం), ఏప్రిల్ 20:
ఇప్పుడు దేశానికి కావల్సింది గుజరాత్ మోడల్ కాదు…అది ఫెయిల్ అయింది. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తం కావాలి. అతి తక్కువ కాలంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుందటమే ఇందుకు నిదర్శనం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బి అర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సీతారపురం, చిప్పరాళ్ల బండ తండా, పొట్టిగుట్ట తండా, ధర్మగడ్డ తండా, గ్రామాలు కలిపి సీతారపురం స్టేజి వద్ద, సీత్యతండా, లకావత్ తండా, లక్ష్మణ్ తండా, పడమటి తండా [డీ] కలిపి ధర్మపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ. రాష్ట్రంలో బి అర్ ఎస్ కు తిరుగులేదు. తెలంగాణలో ప్రతిపక్షాలకు జనాదరణ లేదు. బి అర్ ఎస్ గెలుపునకు ఎదురు లేదు. ఇక ఇప్పుడు కాలవల్సింది దేశానికి సీఎం కెసిఆర్ గారి మార్గదర్శనం. దేశం మొత్తం కెసిఆర్ కోసం ఎదురు చూస్తున్నది. ప్రజలంతా కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రంలో మన పాలనే ఉండాలి. అప్పుడే రాష్ట్రం, దేశం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు.
అభివృద్ధి నిరోధకులకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపు నిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటిటికీ తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. మరోవైపు తెలంగాణ పట్ల కేంద్ర వైఖరిని మంత్రి దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా, అడ్డుపుల్ల వేస్తున్నది అన్నారు. సీఎం కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని మంత్రి వివరించారు.
ఇక, తాను పాలకుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంతున్ననాని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని..సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలలో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు.
పాలకుర్తి నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధి కి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలావాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
మహిళలకు వడ్డిస్తూ, వారితో కలిసి ఆత్మీయ భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నేతలు, కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు. మహిళలతో కలిసి భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు!, శుభాకాంక్షలు!! తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, వారితో తమ ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కార్యకర్తలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు.
ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు.
అంతకుముందు…మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.