నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా డాన్ బోస్కో నవజీవన్ బాల భవన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం ఆవిష్కరించారు .. ఈ సందర్భంగా నవజీవన్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మేరుగు రత్నం మరియు స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..