ప్రీస్టన్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఐదు గంటల పాటు బైటాయింపు ధర్నా
— సమస్యలు పరిష్కరించకుంటే జులై 6 నుండి సమ్మెకు సిద్ధం
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పాలడుగు సుధాకర్ జిల్లా చైర్మన్ రాపర్తి రాజు
ధర్నా దగ్గరికి వచ్చి వినతిపత్రం తీసుకున్న జిల్లా కలెక్టరేట్ ఏవో~~
జనగామ: పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రీస్టియన్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు కదం తొక్కారు
జిల్లా కలెక్టరేట్ గేట్ ఎదుట ఐదు గంటల పాటు బైఠాయించి ఎర్రటి ఎండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అన్నా కార్యక్రమం వద్దకు వచ్చిన జిల్లా కలెక్టరేట్ ఏవో గారికి అందజేశారు
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పాలడుగు సుధాకర్ జిల్లా చైర్మన్ రాపర్తి రాజులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ ఫలితంగా తీసుకుంటూ పంచాయతీ కార్మికుల సమస్యలను మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో సుమారు 50 వేల మందికి పైగా గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బంది పర్మినెంట్ పనికి గుర్తింపు పని పాత్రత కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలని పిఆర్సి లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం పంచాయతీ సిబ్బందికి 19 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విధి నిర్వహణలో మరణించిన గ్రామపంచాయతీ సిబ్బందికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని అన్నారు జనగామ జిల్లాలో 11 నెలల నుండి గ్రామపంచాయతీలలో పెండింగ్ వేతనాలు ఉన్నాయని వాళ్ళు ఎలా పనిచేయాలని ప్రశ్నించారు డిపిఓ కలెక్టర్ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎనిమిది గంటల పని దినం వారాంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని కోరారు సంవత్సరానికి మూడు జాతుల యూనిఫాం సరిపడా చెప్పులు సభ్యులు నూనెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశ ప్రభుత్వానికి 17 డిమాండ్లతో సమ్మె నోటీసు అందించామని ఈ డిమాండ్ల ను జూలై ఐదో తేదీలోపు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెకు పోవడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్లు పగిడిపల్లి మల్లేష్, నారోజు రామచంద్రం, డి శ్రీశైలం బత్తిని వెంకన్న బస్వ రామచంద్రం జేఏసీ జిల్లా నాయకులు ఎస్ విజేందర్ జె ప్రకాష్ రాజేంద్రప్రసాద్ గుర్రం లాజర్ జీడి ఆనందం గుగులోతు రతన్ సింగ్ టి యాకూబ్ బి సురేష్ వి రాజేశం రాజకుమార్ సాంబారి కృష్ణమూర్తి ఎం రామనారాయణ ఉప్పలయ్య పి నాగయ్య ఎం సుధాకర్ రమేష్ శ్రీనివాస్ ఎన్ యాకయ్య వీర మండలాల నుండి వందలాది మంది గ్రామపంచాయతీ కార్మికుల పాల్గొన్నారు