మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి:రామావత్ రమేష్ నాయక్
Andhra Pradeshమణిపూర్ లో జరిగిన మరణ హోమాన్ని మతోద్మాదాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో దేవరకొండ లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్ర కృష్ణ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మణిపూర్ లో గిరిజన తెగ కుకీల మీద మైతి తెగ మతోన్మాదులు మానవత్వం మరిచి మహిళలు అని కూడా చూడకుండా వారిని వివస్తరణ చేసి ఊరేగించి దారుణంగా మానభంగం చేసి హత్య చేసిన ఘటన చూస్తుంటే ఈ మతోన్మాదులు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా ఇంత జరుగుతున్న గత మూడు నెలల నుంచి కనీసం బయటికి విషయాలను రానివ్వకుండా ఇంటర్నెట్ ని మీడియాని కవర్ చేస్తూ బిజెపి ప్రభుత్వం చేస్తున్న మారణ హోమాన్ని పేదల మీద గిరిజనుల మీద ఈరోజు వారు చేస్తున్నటువంటి దాడులను చూస్తే కడుపు తరుక్కుపోతుందని కుక్కి గిరిజన తెగల గొడవలకు ప్రధాన కారణం ప్రభుత్వమే దగ్గర ఉండి ఈ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ బిజెపి పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన నాటి నుండి వెనుకబడిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ బీసీ మత మైనార్టీల మీద దాడులు ఎక్కువగా పెరిగినయని దీనికి కారణం మోడీ ప్రభుత్వమేనని మోడీ గతంలో గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలన్నీ చాలా జరిగాయని దానిని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మణిపూర్ లో కూడా జరుగుతున్నాయని ఇలాంటి మతోన్మాద ప్రభుత్వాలను ప్రజలు వెంటనే గద్దతిపాల్సిన అవసరం ఉన్నది రాబోయే ఎలక్షన్లు బిజెపి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బిజెపి ప్రభుత్వమేనని ఇలాంటి వారికి మరొకసారి అవకాశం ఇస్తే భారతదేశాన్ని సర్వ నాశనం చేసి రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ మోడీ కేడి ప్రభుత్వాన్ని వెంటనే ప్రజలు బుద్ధి చెప్పాలని అని అన్నారు ఇలాంటి సంఘటనలు పునర్వస్తం కాకుండా చూడాల్సిన బాధ్యత మణిపూర్ కేంద్ర ప్రభుత్వం ఉందని మణిపూర్ ప్రభుత్వాన్ని భర్తల చేసి రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు అన్నారు
ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కొండ లలిత బాంసేపు నాయకులు డాక్టర్ రాజారావు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గాలి ప్రకాష్ కార్యదర్శి బాలు నాయక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎర్ర యాదయ్య కొండమల్లేపల్లి అధ్యక్షులు గార యాదగిరి చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ మొగులయ్య బిఎఫ్ కన్వీనర్ భారత్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, బాలకృష్ణ, సైదులు, బాలు తదితరులు పాల్గొన్నారు