కళలను పరిరక్షించి భావితరాలకు అందజేయాలి
Hyderabadహైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వర్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో సృజనోత్సవ్ 2023 అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వర్ రావు, సోషల్ అక్టీవిస్ట్ ఈవి.శ్రీ నివాస్ రావు అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈవి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. భారత దేశ సనాతన కళలను పరిరక్షించి భావితరాలకు అందజేయాలని అన్నారు. ఇటువంటి వేడుకలు ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారులకు ప్రొత్సాకరంగా ఉంటుంద న్నారు. అతిధిగా పాల్గొని పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వర్ రావు లాంటి గొప్ప వ్యక్తి ప్రక్కన కూర్చునే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిదంగా సృజనోత్సవ్ 2023 అవార్డ్స్ లో పాల్గొని అవార్డ్స్ తీసుకున్న దేశం లోని అన్ని రాష్ట్రాల కళాకారులకు అవార్డ్స్ అందచేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా స్వర్ మహతి కళా పరిషత్ అధ్యక్షుడు డా. బి. ఆదిత్య కిరణ్ గారికి నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వర్ రావు గారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, డా. ఆదిత్య కిరణ్ జి సోషల్ అక్టీవిస్ట్ : ఈ.వి.శ్రీనివాస్ రావు ను శాలువా, మెమెంటో తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ : మిరియాల రాఘవ రావు, తెలంగాణ ఎడ్యుకేషన్ డెవెలప్ మెంట్ సొసైటీ, చైర్మన్ : లిబి బెంజమిన్, సరస్వతి ఉపాసకులు : దైవజ్ఞ శర్మ, సుమన్ టివి చీఫ్ ఎడిటర్ : బి. కేశవా రావు, వి వి. బిజినెస్ గ్రూప్ చైర్మన్ వై వీ వీ ఎస్ లక్ష్మణ్ కుమార్, సెక్రటరీ, హిందూస్తాన్ ఆర్ట్స్, మ్యూజిక్ సొసైటీ, కలకత్తా ప్రోసెంజిత్ పొద్దార్ , డీపీఎస్ వరంగల్ చైర్మన్ వి. రవి రెడ్డి, నాదేం శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరియు ౩౦౦ మంది అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. శ్రీ శివసాయి కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ , హనుమకొండ నుండి 11 మంది అవార్డ్స్ (డాన్స్ ఇన్స్ట్రక్టర్ దివ్య ఆధ్వర్యంలో ) అందుకున్నారు. డాన్స్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.