
వచ్చే ఎన్నికల్లో మన టీఆర్ఎస్ సత్త ఏందో చూపిస్తాం
తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ సత్త ఏందో చూపిస్తామని మన టీఆర్ఎస్ పార్టీ అధినేత ఏసిపి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ లో సోమవారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు.అదేవిధంగా తెలంగాణలో అత్యధిక మెజారిటీతో గెలిచే స్థానాలు స్టేషన్ ఘనపూర్,కోరుట్ల,నకిరేకల్,సిరిసిల్ల,భద్రాచలం,సూర్యాపేట,మునుగోడు స్థానాలు అని తెలంగాణలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానంలో ఒంటరిగా పోటీ చేస్తున్నమని,పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో గట్టి పోటి చేస్తున్నామని, రాష్ర్టంలో అధికారంలోకి వచ్చేది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఏసిపి అన్నారు.అనంతరం స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు దీటుగా మన టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని,రెండో మ్యానిఫెస్టోని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఏమ్మెల్యే,ఎంపీ అభ్యర్ధుల సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్ మరియు తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మెన్ పురం సంతోష్ కుమార్,రాజేందర్,వంశీ,రాకేష్,ఝాన్సిరెడ్డీ,సుహాసిని,రమ్య,హారిక,నునవత్,మంగ నాయక్,సులోచన ముదిరాజ్,వాసు గౌడ్,పవన్ యాదవ్,ఇబ్రహీం,గౌసియ బేగం,షర్మిల నాయుడు తదితరులు పాల్గొన్నారు.