విద్యాబుద్ధులు నేర్పించిన గురువు కి పాదాభివందనం
బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్….
స్టేషన్ ఘనపూర్:- ఒక విద్యార్థికి భావి పౌరులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్ది ఒక సమాజాన్ని తయారు చేసి, ఒక దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఘనమైనదని పూర్వ విద్యార్థి, భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని విద్యాబుద్ధులు నేర్పించిన గురువు రాచమల్ల నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కి వారి స్వగృహంలో పాదాభివందనం చేసి, శాలువతో సన్మానించి, పూల మొక్క అందజేసి వారికి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుడు, గురువు పకపక్కన ఉంటే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తా అని అన్నాను. దేవుడు అనేది భగవంతుడు అని, మొదట తనకు చెప్పింది తన గురువు అని అన్నారు. సమాజంలో గురువుకు ఉన్నత స్థానం అంత గొప్పది అని విద్యార్థి యొక్క జీవితాన్ని మార్చేది ఉపాధ్యాయుడే అని విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఆచార్యదేవోభవ అని గురువుని దేవుడి కంటే సమానంగా కొలిచి , విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు మరువలేనివి అని , దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ , అబ్దుల్ కలాం చిన్నప్పుడు వారు దుర్భర జీవితాలు అనుభవించారని వారు నిరంతరం కృషి పట్టుదలతో మహోన్నతులుగా ఎదిగారని గుర్తు చేశారు.
మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ అన్నారు ఆనాటి పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుల దగ్గర నుండి నేర్చుకున్న నడవడిక, క్రమశిక్షణ, పట్టుదల మాత్రమే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల చేతిలో ఉందని విద్యార్థులకు భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని, విద్యార్థుల్లో జ్ఞానజ్యోతులను వెలిగించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని , విద్యార్థి లోకం అంతా భావి భారత కాంతి దీపాలుగా మారెందుకు ఉపాధ్యాయులు అందరూ పాటుపడాలని కోరారు. విద్యార్థుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి అందుకోసం విద్యార్థులతో చనువుగా, స్నేహంతో మెలుగుతారు.
నాకు విద్యాబుద్ధులు, నడవడిక, క్రమశిక్షణ, విలువలు, పట్టుదల నేర్పించిన ఉపాధ్యాయుడు కి సన్మానించి పాదాభివందనం చేయడం నాకు గర్వంగా ఉందని అన్నారు.