గులాబీ గూడులోకి కాంగ్రెస్ నాయకులు
గణపురం మండలం కేంద్రానికి చెందిన వడ్డెర సంఘానికి చెందిన ప్రముఖులు 50 మంది కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నుంచి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి. వడ్డెర సంగం జిల్లా అధ్యక్షుడు బత్తుల రవి,మండల అధ్యక్షుడు శివరాత్రి సారయ్య, కుల పెద్దమనిషి దండుగుల రవీందర్ మరియు 50మంది పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ పొలుసానిలక్ష్మీనరసింహారావు,PACS చైర్మన్ పోరెడ్డి పూర్ణ చందర్ రెడ్డి,సర్పంచ్ ఓదాకర్ తదితరులు పాల్గొన్నారు