నాటికి నేటికీ పెళ్లిళ్ళు పరిస్థితి . నాడు ఎలా పెళ్లి చేసుకునే వారు నేడు పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దాం .
పెద్దలు అనే మాట సాధారణంగా పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అనే వారు ఈ సామెత ఎందుకు వచ్చింది అంటే మనం ఎన్నాళ్ళు పెంచి పోషించిన వారు అమ్మాయిని ఇచ్చేవాళ్ళు మనం గారంబంగా చూసుకునే వాళ్ళం మన అమ్మాయి ని అక్కడికి పంపిస్తున్నాం అంటే అక్కడ మనం చూసుకున్నా దాని కన్నా అంటే 100 రేట్లు అన్నీ విధాలుగా ఎక్కువగా ఉండాలి అనుకుంటారు తల్లిదండ్రులు .
నలుగురు సరే అనే విధంగా బతకాలి ఒక్కరితో మాట పడకుండా ఉండాలి అనుకుంటారు .
ఇకపోతే అబ్బాయి వాళ్ళు అక్కడ ఎలా ఉన్న మన ఇంటికి వచ్చే సరికి అమ్మాయి మన ఆడపిల్లలను (ఆడపడుచులను ) అత్త మమను బాగా చూసుకోవాలి వంట ఇంటి పనులు బయటి పనులు వచ్చి వుండాలి అనుకుంటారు .
నాడు ఇంటి పనులతో పాటు పొలం పనులు వచ్చి వుండాలి అనే వారు
నేడు ఇంటి పనులు చేసుకుంటే సారి పోదు ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి అంటున్నారు
ఇక మన పెళ్లి విషయంలోకి వెళ్తే
సంబందాలు చూడడం
సంబందాలు చూసే సమయంలో నూరు అబద్దాలు ఆడి అయిన ఒక పెళ్లి చేయాలి అంటుడేవారు ఆ రోజుల్లో సంబందాలు చూడాలి అంటే అయ్యగారు లేదా పంతులు దగ్గరికి ముందుగా వెళ్ళే వారు వెళ్ళి మా అమ్మాయికి , మా అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అనగానే ఆ అయ్యగారు మీరు ఉత్తరం దిక్కున వెళ్తే పెళ్లి అయ్యితది అనగానే వారు ఆ పక్కన వున్న గ్రామాలు తిరగడం వెతకడం ప్రారంభిచే వాళ్ళు అక్కడ వున్న చూట్టాలకి పక్కలకి చెప్పే వాళ్ళు మా అబ్బాయి వున్నాడు అమ్మాయి కావలి లేదా మా అబ్బాయి వున్నాడు అమ్మాయి కావాలి అనే వారు అలా అందరికీ చెప్పి వుంచే వారు ఎవరు అయ్యిన వారికి తగ్గ వారు అనుకుంటే అక్కడ వున్న వాళ్ళు వీరికిచెప్పే వాళ్ళు వారు సరే అనుకుంటే ఓ నలుగురు పెద్ద మనుషులతో కలిసి వల్ల ఇంటికి వెళ్ళే వారు .
వెళ్ళిన దగ్గర నుండి వారి పద్దతులను గమనించడం మొదలు పెట్టేవాళ్ళు అక్కడ వాళ్ళ స్థితి గతులను చూసే వాళ్ళు అక్కడ నుండి వీరి తరుపున వచ్చిన వాళ్ళు వాళ్ళ తరుపున వున్న వాళ్ళు కూడా ఒక్కరి గురించి ఒక్కరు అడిగి తెలుసుకొని ఆ ముచ్చట ఈ ముచ్చట తో మెదలు అయ్యి మళ్ళీ ఇగ పెళ్లి కాడికి వచ్చేది ఆ ఇగో పిలగాడు గీ పని చేస్తాడు మరి మీరు ఏమంటారు అనగానే వచ్చిన వాళ్ళు తలో మాట చెప్పి వీళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకు వాళ్ళ వివరాలు ఒక్కరికీ తెలియజేసే వాళ్ళు ఇగో గది గుర్రం గిది మైదానం అని చెప్తాం అంటూ మరొకరు ముగించే ప్రయత్నం చేసే వాళ్ళు వుంటారు
పెట్టు బోతలు
సరే అన్నీ ఇరు కుటుంబాలకు ఒప్పందం అయితే అబ్బాయికి మీరు ఏమి ఇస్తారు చెప్పండి అంటూ వుంటే ఏమి పెట్టుకున్న మీ అమ్మాయికే అని మరో మాట అంటారు . దీనినే మరో విదంగా వరకట్నం అని అంటారు గతం లో అయితే ఓ హీరో సైకిల్ , రేడియో . అరుణం కింద ఓ బర్రె ను తొలమనీ అడిగేది పైసలు దీపాల కట్నాలు , సంక్రాంతి కట్నాలు అని మళ్ళీ బట్టలు పెట్టాలి ఇగ బంగారం , అని లేదా వున్న స్థాయి ని బట్టి పసుపు కుంకుమ కింద ఇంత భూమి రాసి ఇయ్యలి అని అడిగే వారు ఇక వారి కుటుంబాల పరిస్థితి ని బట్టి ఇవ్వగల్గిన స్థాయి ని బట్టి ఒప్పందాలు జరిగేవి
ఇవి జరిగాక లగ్న పత్రిక రాసుకునే వారు దీనినే లగం కోటు ఏసుకున్నారు అనే వారు
లగ్గం కోటు అంటే అందులో ఎ ముహూర్తన పెళ్లి
ఇంకా మా వాళ్ళు రాస్తున్నారు ..