
రైతులకు అండగా కిసాన్ పరివార్
రైతు దేశానికి వెన్నెముక అని రైతు లేనిదే రాజ్యం లేదనీ అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ అన్నారు రైతుకు జరిగే అన్యాయాలు.నష్టాలకు సంబంధించి ఈ నెల 10తేదీన కురవి మండల కేంద్రంలో నియోజక వర్గ స్థాయిలో భారత్ బచావో రైతు రణభేరి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు
రైతు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరను నిర్ణయించక పోవడంతో, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు రాక రైతులు రోడ్డున పడుతున్నారని అన్నారు, మేము నిర్వహిస్తున్న రైతు రణ భేరి సభలో రైతుల సలహాలను సూచనలను అనుసరించి రానున్న రోజుల్లో మరింతగా రైతుల పక్షాన నిలిచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలో నీ రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చా