
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం
తమ్మడపల్లి (జి) గ్రామం లో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.నిర్వహించడం జరిగింది ఈసందర్బంలో ఐద్వా జిల్లా కార్యదర్శి MD షబానా మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నిఅంటాయి ఉద్యోగాలు లేక విద్యార్థులు నిరుద్యోగం తో ఆత్మ హత్యలు చేసుకుంటున్నరని అన్నారు దేశంలో కోట్ల మంది ప్రజలు పేదరికం తో బాధ పడుతున్నారు అని అన్నారు. ధరలు అదుపు చెయ్యాల్సిన ప్రభుత్వం దళారులకు పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ముకాస్తున్నారని అన్నారు అదేవిదంగా భర్త చనిపోయిన వితంతు లకు 2సంవత్సరాలు గడుస్తున్నప్పటికి పించన్ ఇవ్వని పరిస్థితి ప్రభుత్వం గుడ్డిగా కళ్ళు లేనట్లుగా వ్యవహరిస్తుంది అని అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు డీలర్ షాపులల్లో 18 రకాల సరుకులను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో బక్క యాదమ్మ, నక్క అనూష, గుర్రపుశృతి, ఉప్పునుతుల ఎల్లమ్మ,రాపర్తి రజిత,నక్క శారదా,బక్క పిచ్చమ్మ,దొంతురి సంధ్య,రాపర్తి లక్ష్మి,రాపర్తి ఎల్లమ్మ,చినూరు రాజమ్మ తదితరులు పాల్గొన్నారు