
హరిహర క్షేత్రంలో ఘనంగా శ్రావణ శుక్రవారపు పూజలు
శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని మండల కేంద్రం లోని రత్నవరం గ్రామం లోని హరిహర క్షేత్రంలో కనకదుర్గమ్మ కు మహిళలు కుంకుమ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకొని చీరలు, సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ పూజ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.