
వేలేరు మండలం గుండ్ల సాగర్ గ్రామం నందు ఎమ్మెల్యే వీరాభిమాని, ఎమ్మెల్యే కి ఆప్తులు గాదె శ్రీనివాస్ రెడ్డి సతీమణి క్రీ.శే. గాదె వినోద మరణించగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ తాటికొండ రాజయ్య గుండ్లసాగర్ లోని వినోద గారి ఇంటిని సందర్శించి, వినోద గారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వినోద అంతిమయాత్రలో పాల్గొని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు..
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..