
భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికల పరంపర కొనసాగుతోంది. అందులో భాగంగా భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, వారందరికీ టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో కాసింపల్లి గ్రామ నుండి కడారి మాలతి(బిజెపి అర్బన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు) కాసింపల్లి గ్రామం నుండి ఆకుల స్వరూప (బిజెపి అర్బన్ మహిళా మోర్చా కార్యదర్శి) ఫకీర్ గడ్డ నుండి జంబోజు పద్మావతి (బీజేపి అర్బన్ మహిళా మోర్చా అధికార ప్రతినిధి),రామ్ నగర్ కాలనీ నుండి అంగిడి వసుమతి (బీజేపి అర్బన్ సహాయ కార్యదర్శి)..
రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం నుండి.
ఇండ్ల శశిధర్ (బీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు మెంబర్),
పాలడుగుల రజిత – స్వామి (బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డ్ మెంబర్),
పాలడుగుల సుమన్ (బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు),
మండల నరసయ్య (మాల సంఘం మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు) వీరితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్తన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అందుకు అహర్నిశలు పని చేస్తామని పార్టీలో చేరిన ఆయా నాయకులు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఈ బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని అన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్, బీజేపి రెండు పార్టీల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన, చేరబోతున్న నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారి కుటుంబ సభ్యుడిలా ఉంటానని అన్నారు