
ప్రజలపై అధిక భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మునగాల మండల కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మునగాల డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అధ్యక్షతన మునగాల డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంజరిగింది.ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిల్ల నవీన్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పైన అనేక బారలు మోపుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలను నట్టేట మంచుతున్నాయి అన్నారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి పెరుగుదల తగ్గించాలన్నారు.డిఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ రోజురోజుకు నిరుద్యోగుల సమస్య పెరుగుతుందని యువత ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ వెయ్యకుండా యువతను మతం మత్తులోకి లాగుతున్నారని అన్నారు. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అని అన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లో వేయాలని ప్రభుత్వాలలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జమ్మి ఎల్లయ్య, పాల్గొన్నారు