
కామ్రేడ్ బిక్ష్మారెడ్డి ఆశయాలను సాధిస్తాం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు చేసే వ్యక్తి కామ్రేడ్ రణబోతు బిక్ష్మారెడ్డి అని సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎస్కే మస్తాన్ అన్నారు. సోమవారం కరివిరాల గ్రామంలో మాజీ గ్రామశాఖ కార్యదర్శి, మాజీ కోపరేటివ్ బ్యాంక్ సభ్యులు కామ్రేడ్ రణబోతు బిక్ష్మారెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ చేసే పోరాటాలల్లో క్రియాశీలకంగా పనిచేసేవారన్నారు.సిపిఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘాన్ని నిర్మాణం చేయడంలో ప్రముఖ భాధ్యత వహించారని, వారి ఆశయ సాధన కోసం యువతీ యువకులను ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి కేసగాని భద్రయ్య పార్టీ సభ్యులు సతీష్ రెడ్డి, సర్దార్, మహమ్మద్, పద్మ రాధిక,జస్మిక తదితరులు పాల్గొన్నారు….