200 మంది యూనివర్సిటీ ఉద్యోగ కార్మికులు సిఐటియు లో చేరిక
Warangalకనీస వేతనాలు అమలు చేయాలి
కారుణ్య నియామకాలు చేపట్టాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
కాకతీయ యూనివర్సిటీలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు 200 మంది బుధవారము సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ సమక్షంలో సిఐటియు లో చేరారు ఈ సందర్భంగా సిఐటియులో చేరిన ఉద్యోగులను కార్మికులను కండువాకప్పి స్వాగతం తెలిపారు సిఐటియు లో చేరిన ఉద్యోగులకు కార్మికులకు యూనియన్ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ పోరాటాల చరిత్ర గలిగిన సిఐటియులో యూనివర్సి ఉద్యోగులు కార్మికులు చేరడం సంతోషకరమని తెలిపారు యూనివర్సిటీ పాలకవర్గం అధికారులు తక్షణమే ఉద్యోగులకు కార్మికులకి కనీస వేతనాలను పెంచాలని ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలని కారుణ్య నియామకాల ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టు ఉద్యోగులకు కార్మికులకు జీవో 63 పిఆర్సి ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులను రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెట్టు రవి పెండ్యాల రవి యూనివర్సిటీ యూనియన్ నాయకులు కచ్చకాయల చిరంజీవి దేశిని రవి మొగిలి రాజేందర్ రాజు సిహెచ్ రమేష్ దామెర కృష్ణ శ్రీనివాస్ ఉదయ్ సంగాల రాజు లక్ష్మి యాకూబ్ శోభ లతోపాటు 200 మంది ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు