
ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసంఘటిత రంగాల బిల్డింగ్ హామాలి ట్రాన్స్పోర్ట్ బీడీ రంగాల వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన kopta చట్టాన్ని ఎత్తివేయాలని అలాగే బీడీ పరిశ్రమపై తీసుకొచ్చిన జీఎస్టీని ఎత్తివేయాలని బీడీ కార్మికులకు కనీస వేతనల జీవో అమలు చేయాలని 41..GO ను తక్షణమే అమలు చేయాలని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడి టే కధార్, ప్యాకర్ చాటర్ బట్టి మరియు బీడీ కార్మికులు అందరికీ ఆంక్షలు లేని జీవన భృతి ఇవ్వాలని కోరారు అలాగే బీడీ కంపెనీలో కార్మికులకు 26 రోజులు పని కల్పించాలని ప్యాకర్ చాటన్ బట్టి కార్మికులకు నెలకు 26000,₹వేతనం ఇవ్వాలని అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని నాన్ pF కార్మికులకు అందరికీ పిఎఫ్ నంబర్ నివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వెంకట్ గౌడ్ బీడీ సంఘం నాయకులు సత్యం బాలమణి అజయ్ వేణు రమేష్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు