హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై వీరనారి చిట్యాల (చాకలి)ఐలమ్మ విగ్రహం పెడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు.తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి.మదర్ మాట్లాడుతూ. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, పోరాడిన వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి పై ఏర్పాటు చేస్తామని తెలిపినా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పాలకుర్తి.ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మరియు మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమార్ ,ఎస్సీ సెల్ అధ్యక్షులు జలగం కుమార్,ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం,మండల అద్యక్షులు చిట్యాల సమ్మయ్య, జిల్లాలనాయకులు లొంక ఐలయ్య,మండల ఉపాధ్యక్షులు గుమ్మడి రాజు పాపయ్య.చిట్యాల శ్వేత సంపత్.చిట్యాల ఎల్లయ్య.జ్యోతి కొమురయ్య చిలూరి సోమరాజు చేలూరి అంజయ్య చిట్యాల సాంబరాజు గుమ్మడి రాజ కొమురయ్య మచ్చ సోమయ్య గుడి కందుల రవి.తదితరులు పాల్గొన్నారు.