
ఈ69న్యూస్ జనగామ ఆగస్ట్ 4
జనగామ జిల్లా నర్మెట్ట మండలం మలకపేట గ్రామానికి చెందిన అన్మెన్ కార్మికుడు బానోతు రాజు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో బానోతు రాజు భార్య నీలకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం కల్పించాలనే డిమాండ్‌తో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.జనగామ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు తెలిపారు.ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని,బాధిత కుటుంబానికి అన్ని నష్టపరిహారాలు,ఇన్సూరెన్స్ లబ్ధులు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.కుమారస్వామి మాట్లాడుతూ..అన్మెన్ కార్మికులపై అధికారి దుర్వినియోగం పెరిగిందని,పని ఒత్తిడితో వారి ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వినతిపత్రం కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్,బానోత్ కిషన్,గూగులోత్ రవీందర్,చిన్న తదితరులు పాల్గొన్నారు.