
అహ్మదీయ ముస్లిం జమాత్ వార్షిక మహాసభలను విజయవంతం చేయండి
లండన్ కేంద్రంలో అహ్మదీయ ముస్లిం జమాత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మూడు రోజుల(28,29,30)వార్షిక మహా సభలు జమాత్ ప్రస్తుత ఐదవ ఉత్తరాదికారి (ఖలీఫా)హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ తన శుక్రవారం ప్రత్యేక ఉపన్యాస,ప్రార్ధనలతో మొదలయ్యాయని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్ తెలుగు గళం న్యూస్,ఈ69 న్యూస్ తో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..1891లో, ఖాదియాన్ పంజాబ్ ఇండియాకు చెందిన మీర్జా గులాం అహ్మద్ తానే వాగ్దానం చేయబడిన మెస్సీయ మరియు మహదీ అని పేర్కొన్నాడని అదే సంవత్సరంలో అతను మొదటి వార్షిక సమావేశాన్ని 1891 సంవత్సరంలో-జల్సా సాలానా-డిసెంబర్ 27,28 మరియు 29 తేదీలలో భారతదేశంలోని ఖాదియాన్లో నిర్వహించాడని నాడు మొత్తం 75 మంది మాత్రమే పాల్గొన్నారని కాని నేడు లక్షల మంది జనాభాతో 200కు పైగా దేశాలలో ఈ వార్షిక మహాసభలు విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సభల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ప్రతీ నిజాయితీ గల వ్యక్తి వ్యక్తిగతంగా,మతపరమైన ప్రయోజనాలను అనుభవించేలా చేయడం కోసం,మరియు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం,మరియు అల్లాహ్ యొక్క శుభాలు పొందడం కోసం మరియు ఉన్నతమైన,ఆశయాలను పొందడానికి కోసం,అలాగే ద్వితీయ ఉద్దేశం ఈ సమ్మేళన సమావేశముల ద్వారా సోదరులందరి మధ్య పరస్పర పరిచయాన్ని ప్రోత్సహించు కోవడం కోసమని,మరియు ఇది ఈ సంఘంలో సోదర సంబంధాలను బలోపేతం చేయడం కోసం దోహద పడతాయని జమాత్ స్ధాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ ఉపదేశించారని తెలిపారు. ఈ మూడు రోజుల మహా సభలు లండన్ నుండి ముస్లిం టెలివిజన్ అహ్మదీయ(ఎంటిఎ)శాటలైట్ చానెల్ ద్వారా మరియ యూట్యూబ్,ఫేస్బుక్,ఇన్స్ట్రా గ్రాం తదితర సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని ప్రతీ ఒక్కరు ఈ మహా సభలు తప్పనిసరిగా వీక్షించి విజయవంతం చేయాలని కోరారు.