ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ. -ఎస్ఎఫ్ఐ ,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యలయంలో చంద్రశేఖర్ఆజాద్ 93వ వర్ధంతి సభ హైదరాబాద్ : గొప్ప విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం చేతిలో చంపబడ్డ అమరుడు. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన 93వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యలయంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కొట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడారు. వారు మాట్లాడుతూ చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారని అతి చిన్న వయసులోనే స్వాతంత్య్రం కోసం ,నాటి బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరత్వంతో పోరాడాడని అన్నారు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో చంద్రశేఖర్ అజాద్. ఒక్కరని కొనియాడారు. కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా ఉండి యువకులను దేశభక్తులుగా తిర్చిదిద్దారని తెలిపారు. సోషలిస్టు భావాలతో దేశంలో అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ,మొత్తం సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. బ్రిటిష్ వారుదేశంలో హిందువులు, ముస్లీంల మధ్య మత ఘర్షణలు పెట్టాలని చూసిన మతన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా భారతీయులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆజాద్ స్ఫూర్తితో నేడు దేశంలో దేశ సామ్రాజ్యవాద ఎజెంట్లు, మతోన్మాదులు మోదీ, షా లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం,అధిక ధరలు, రైతులు ఆందోళన, కార్మిక చట్టాలు సవరణ చేస్తూ దేశాని అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారని అన్నారు. దేశంలో బిజెపి అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్ధి, యువజనులు ఆజాద్ స్ఫూర్తితో “బిజెపి నుండి ఆజాదీ కోసం, ఆరెస్సెస్ నుండి ఆజాదీ కోసం, పెట్టుబడి దారుల నుండి ఆజాదీ కోసం, దొపిడి నుండి, నిరుద్యోగం నుండి, అధిక ధరలు నుండి ఆజాదీ” కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేష్, కెవిపిఎస్ రాష్ట్ర ఆఫిస్ కార్యదర్శి బాలపీర్ తదితరులు పాల్గొన్నారు.