
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు నిత్యం సెలవులు తీసుకును పాఠశాలకు రాక పోవడం వలన పిల్లలకు సరియైన విద్య అందడం లేదని అలాంటి ఉపాధ్యాయులు మా పాఠశాలకు అవసరం లేదని విద్యా కమిటీ చైర్మన్,విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి స్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గీతకు వినతి పత్రం అందించారు.అనంతరం విధ్యా కమిటి చైర్మన్ రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిత్యం సెలవుల్లో ఉంటున్నారని, ఇద్దరో ముగ్గురో టీచర్స్ వచ్చినప్పటికి పిల్లలను అదుపు చేయలేక పోతున్నారని,5వ తరగతి చదువుతున్న కొందరి విద్యార్థులతో బోధన చేయించడం జరుగుతుందని,దీనితో విద్యార్థులకు సరియైన విధ్య అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అలాగే గణతంత్ర దినోత్సవం రోజు పిల్లలు ర్యాలీగా గ్రామంలో తిరుగుతుంటే ఒక్క ఉపాధ్యాయులు కూడా వెంట రాలేదని మండి పడ్డారు.విద్యార్థులతో అసభ్య కరంగా మాట్లాడుతారని,ఇలాంటి ఉపాధ్యాయులు మాకు వద్దే వద్దు అని విద్యార్థుల తల్లిదండ్రులు పై అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ రాజు మెంబర్స్ పులిగిల్ల నాగరాజు, వడ్లకొండ సుధాకర్, వార్డ్ మెంబర్ సతీష్, కొంత కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.